Chandrababu: ఓటేసి మార్పుకు నాంది పలకండి : సీఎం చంద్రబాబు ట్వీట్‌

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో అర్హులైన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ట్విట్టర్‌ వేదికగా తన సందేశాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. మీరు వేసే ప్రతి ఓటు మార్పునకు నాంది పలుకుతుందని గ్రహించాలని సూచించారు.

ప్రతి ఓటు విలువైనదని, హక్కును సద్వినియోగం చేసుకుని మార్పునకు దోహదపడాలని కోరారు. తెలంగాణ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమించిన విషయం తెలిసిందే. మహాకూటమి పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్ లను ఒకే తాటిపైకి తెచ్చి సమష్టి పోరాటానికి తెరలేపారు. తొలి రోజుల్లో ఏకపక్షంగా జరుగుతాయన్న ఎన్నికలను హోరాహోరీ దిశగా నడిపించిన ఘనత చంద్రబాబుదే.
Go Back to Shorts
Chandrababu
Twitter

More Telugu News