governer narasimhan: ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు

  • భార్యతో కలిసి ఖైరతాబాద్‌ మక్తా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన నరసింహన్‌
  • పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
  • ముఖ్యమైన ఓటు కోసం ఓ గంట సమయం కేటాయించాలని సూచన
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ శుక్రవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని మక్తా పోలింగ్‌ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓ గంట సమయాన్ని కేటాయించాలని, ముఖ్యంగా యువత తమ బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. వీకెండ్‌ సెలవులు కలిసి వస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రెండు రోజులపాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని చమత్కరించారు.
governer narasimhan
khairathabad
casting vote

More Telugu News