Vijayasai Reddy: లోకేష్ నాయుడికి టెన్షనో టెన్షన్: వైరల్ అవుతున్న విజయసాయిరెడ్డి పోస్ట్

  • లోకేశ్ టార్గెట్ గా విరుచుకుపడ్డ విజయసాయి
  • ల్యాప్ టాప్ లో చూసి డబ్బు డెలివరీ
  • పోలీసులు పట్టుకుంటుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారని సెటైర్లు
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ తన ఫేస్ బుక్ లో మరోసారి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. తన తండ్రి చెప్పినట్టుగా డబ్బులు పంపుతుంటే, తెలంగాణ పోలీసులు మధ్యలో ఆపడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారని సెటైర్లు వేశారు.

"లోకేష్ నాయుడు ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. డాడీ చెప్పినట్టుగా ఎవరెవరికి ఎంత పంపించాలని ల్యాప్ టాప్ లో చూసి డెలివరీ చేస్తున్నాడు. అయితే తెలంగాణా పోలీసులు మధ్యలోనే పట్టుకుని క్యాండిడేట్లకు చేరకుండా ఆపడమేంటి. మేం డబ్బులిస్తాం గాని ఓట్లేసేది ప్రజలే గదా అని, ఇలా చేస్తే మేం రాజకీయాలెలా చేయాలి. నేను ట్రెయిన్ అయిందే ఈ తరహా పద్దతుల్లో కదా అని ప్రశ్నిస్తున్నాడట" అని ఆయన పోస్టు పెట్టగా, దీన్ని వైకాపా వర్గాలు వైరల్ చేస్తున్నాయి.
Vijayasai Reddy
Facebook
Nara Lokesh

More Telugu News