BJP: రాహుల్‌గాంధీపై కోడ్‌ ఉల్లంఘన కేసు పెట్టిన బీజేపీ: ఎన్నికల అధికారికి ఫిర్యాదు

  • రజత్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు అందించిన ఇంద్రకరణ్ ‌రెడ్డి
  • నిబంధనకు విరుద్ధంగా కొన్ని పత్రికలకు ప్రకటను ఇచ్చినట్లు ఆరోపణ
  • రాహుల్‌ ఇంటర్వ్యూలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి
రాహుల్‌ గాంధీ ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించే చర్యలకు పాల్పడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

నిబంధనలు అనుమతించకపోయినా కొన్ని పత్రికలకు ప్రకటనలు జారీ చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కొన్ని పత్రికలకు  రాహుల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా ప్రకటించి ఎన్నికల ఖర్చు కింద చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు విషయాన్ని ఇంద్రసేనారెడ్డి ధ్రువీకరించారు.
BJP
Congress
election commission

More Telugu News