Hyderabad: ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించలేదు: పోసాని కృష్ణ మురళి

  • ఎల్లారెడ్డి గూడలో పోలింగ్ కేంద్రం
  • సరైన లైట్లను ఏర్పాటు చేయలేదన్న పోసాని
  • ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ చేసిన ఏర్పాట్లపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు.

 ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని చెప్పారు. ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
Hyderabad
Elections
Posani Krishnamurali
EVM
Lighting

More Telugu News