ananthapuram: ‘అనంత’ను సస్యశ్యామలం చేసేశామని ఎంతో అద్భుతంగా చంద్రబాబు నమ్మించారు!: పవన్ కల్యాణ్

  • వాస్తవాలు దాడిపెడుతున్నారు
  • అందువల్లే, ప్రజలకు కష్టాలు తప్పట్లేదు
  • రైతుల వద్ద రెయిన్ గన్స్ ఏవి?
అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేశామంటూ జాతీయ మీడియాను సీఎం చంద్రబాబునాయుడు చాలా అద్భుతంగా నమ్మించారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇక్కడి సమస్యలు, కరవు దుస్థితి బయటకు రాకుండా ప్రభుత్వాలు వాస్తవాలు దాడిపెడుతున్నాయని, అందువల్లే, ప్రజలకు కష్టాలు తప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రూ.300 కోట్లు ఖర్చు చేసి రెయిన్ గన్స్, రూ.700 కోట్లు వెచ్చించి గుంటలు తవ్వారు కానీ, రైతుల వద్ద మాత్రం ఆ రెయిన్ గన్స్ లేవని విమర్శించారు. ఏ రైతు పొలం వద్ద అయితే రెయిన్ గన్ ని చంద్రబాబు ప్రారంభించారో, ఆ రైతుని కలుద్దామని అక్కడికి వెళితే, స్థానిక నాయకులు అతన్ని దాచేశారని, వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం వల్లే ఈ విధంగా చేశారని విమర్శించారు.
ananthapuram
janasena
Pawan Kalyan
Chandrababu

More Telugu News