Rahul Gandhi: ‘బెటర్‌ ఇండియా’లో భాగంగా విద్యార్థులకు లేఖ రాసిన రాహుల్

  • విద్యార్థులు దేశ నిర్మాతలు
  • నేరుగా అవకాశాలు కల్పిస్తాం
  • అవినీతి అంతానికి కృషి
విద్యార్థులకు గౌరవం దక్కేలా చూస్తామని.. వారి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కావల్సిన మద్దతు అందిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘బెటర్‌ ఇండియా’ పేరుతో చేస్తున్న ప్రచారంలో భాగంగా విద్యార్థులకు ఓ లేఖ రాశారు. ఆ లేఖను స్థానిక భాషల్లోకి అనువదించి నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) ద్వారా దేశ వ్యాప్తంగా కళాశాలలకు పంపనున్నారు.

విద్యార్థులు దేశ నిర్మాతలని.. వారిని వెనక్కి నెడుతున్న అవినీతిని అంతం చేసి నేరుగా అవకాశాలు కల్పిస్తామని లేఖలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అంతానికి కృషి చేస్తుందని.. విద్యార్థుల ప్రాధాన్యతల కోసం పోరాడుతుందని రాహుల్ వెల్లడించారు. దీని కోసం పార్టీ ఏం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Rahul Gandhi
Better India
Students
NSUI

More Telugu News