jabardasth rajamouli: హైపర్ ఆదిపై వచ్చిన పుకార్ల గురించి 'జబర్దస్త్' రాజమౌళి

  • హైపర్ ఆదికి కాల్ చేశాను
  • ఆయన ఆల్ రౌండర్ 
  • వత్తిడి వల్లనే దూరం
'జబర్దస్త్' కామెడీ షో చూసేవారికి హైపర్ ఆదిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. హైపర్ ఆది కోసమే ఈ కామెడీ షో చూసేవారున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి హైపర్ ఆది కొన్ని వారాలుగా ఈ షోలో కనిపించడం లేదు. పెళ్లి విషయంలో ఇంట్లోవాళ్లు వత్తిడి చేయడం వలన అని .. సినిమాల్లో బిజీ కావడం వలన అని ప్రచారం జరుగుతోంది. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన రాజమౌళి, హైపర్ ఆది గురించి వస్తోన్న పుకార్లపై తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు.

రీసెంట్ గా హైపర్ ఆదికి నేను కాల్ చేశాను .. ఎందుకన్నా రావడం లేదు? అని అడిగాను. మానసికంగా ఒత్తిడికిలోను కావడం వల్లనే అని చెప్పాడు. కొన్ని రోజులపాటు రెస్టు తీసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. తన స్కిట్లకి తనే స్క్రిప్ట్ రాసుకుంటాడు. నటించడమే కాకుండా టీమ్ లీడర్ గా బాధ్యతలు వహిస్తాడు. అంతేకాదు వేరే షోలు కూడా చేస్తున్నాడు. అంతే తప్ప బయట జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని చెప్పాడు. 
jabardasth rajamouli
aadi

More Telugu News