Anushka Sharma: గర్భవతి అయిందనే వార్తలపై అనుష్క శర్మ స్పందన!

  • అనుష్క గర్భవతి అయిందంటూ కొన్ని రోజులుగా ప్రచారం
  • ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన అనుష్క
  • సినీ పరిశ్రమలో ఉన్నవారిపై ఇలాంటి పుకార్లు సహజమేనంటూ వ్యాఖ్య
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మలు గత ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక అనుష్క గర్భం దాల్చిందంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే సినిమాలకు అనుష్క గ్యాప్ ఇచ్చిందని అంటున్నారు. ఈ వార్తలపై అనుష్క స్పందించింది. ఎవరైనా పెళ్లిని దాచగలరుకానీ, గర్భాన్ని దాచగలరా? అని ప్రశ్నించింది. ఇలాంటి పుకార్లను తాను ఏ మాత్రం పట్టించుకోనని చెప్పింది. సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని తెలిపింది. పెళ్లి కాకుండానే వివాహితను చేయడం, గర్భం దాల్చకుండానే తల్లిని చేయడంలాంటివి జరుగుతుంటాయని మండిపడింది. 
Anushka Sharma
Virat Kohli
pregnant
bollywood

More Telugu News