jabardasth rajamouli: తాగుబోతు పాత్రనే మంచి గుర్తింపు తెచ్చింది: 'జబర్దస్త్' రాజమౌళి

  • మొదటి నుంచి నటన అంటే ఇష్టం 
  • 2015లో 'జబర్దస్త్'కి పరిచయమయ్యాను
  • నాగబాబుగారు నన్నెంతో మెచ్చుకున్నారు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటులలో రాజమౌళి ఒకరు. ఆర్పీ టీమ్ లో తాగుబోతుగా ఎంట్రీ ఇస్తూ రాజమౌళి తెగ నవ్వించేస్తుంటాడు. స్కిట్ లో భాగంగా ఆయన పాడే పేరడీ పాటలు కూడా జనంలోకి బాగా వెళ్లాయి. అలాంటి రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .." మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. నటనకి సంబంధించి లోకల్ గా నాకు మంచి గుర్తింపు ఉండేది.

2015లో నేను 'జబర్దస్త్' వేదికపై అడుగుపెట్టాను. నాకు ఇచ్చిన పాత్రలకి న్యాయం చేస్తూ వెళ్లేవాడిని. ఒకసారి తాగుబోతు పాత్ర చేశాను .. నేను ఆ పాత్రని చాలా బాగా చేశానని నాగబాబుగారు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్ లో నా నటనకి జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాగుబోతు పాత్రలే ఎక్కువగా చేయవలసి వచ్చింది. తాగుబోతు పాత్రల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకోవడం వలన ఈ రోజున ఇంతమంది అభిమానాన్ని పొందుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
jabardasth rajamouli

More Telugu News