Bengalore: నేను అందంగా ఉన్నానట... నాయకులు అదోలా చూస్తున్నారు: బెంగళూరు బీజేపీ మహిళా నేత ఆవేదన

  • నన్ను మరో కోణంలో చూస్తున్నారు
  • వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్న కార్పొరేటర్
  • 'మీటూ' వివాదంలో బెంగళూరు పాలికె
బెంగళూరు నగర పాలక సంస్థ ఇప్పుడు 'మీటూ' వివాదంలో చిక్కుకుంది. ఓ మహిళా నేత తనను పలువురు వేధిస్తున్నారని వాపోయింది. బీజేపీకి చెందిన ఆమె, డిప్యూటీ మేయర్ ఎన్నిక, స్థాయి సంఘాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వేళ, సంచలన ఆరోపణలు చేసింది.

తాను అందంగా ఉండటంతో, చాలా మంది తనను మరో కోణంలో చూస్తున్నారని, దీని వల్ల తనకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని కంటతడి పెట్టుకుంది. ప్రతి సంవత్సరం తనకు స్థాయి కమిటీలో స్థానం వచ్చినట్టే వచ్చి వెనక్కు వెళ్లిపోతోందని, దానికి ఈ వేధింపులే కారణమని చెప్పుకొచ్చింది. ఆమె ఆరోపణలు ఇప్పుడు 'బెంగళూరు పాలికె' తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Bengalore
Bjp
Corporator
MeToo India

More Telugu News