Casting Couch: మరో క్యాస్టింగ్ కౌచ్... అవకాశాల పేరిట వ్యభిచారం... వీడియోలు పోస్ట్ చేసిన తమిళ నటి!
- కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం
- మోహన్ రాసలీలల వీడియోలు బట్టబయలు
- తన పేరును మాత్రం చెప్పలేనన్న నటి
కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం చెలరేగింది. మోహన్ అనే క్యాస్టింగ్ డైరెక్టర్ వర్ధమాన తారలకు అవకాశాలను ఎరగా చూపి, వ్యభిచారం చేయిస్తున్నాడని ఓ యువతి ఆయన రాసలీలలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తన రాసలీలలను బయట పెడితే, తనతో తీసుకున్న వీడియోలను బహిర్గతం చేస్తానని ఆయన బెదిరిస్తున్నాడని ఆరోపించింది.
అవకాశాల పేరిట అతను చేస్తున్న దందాపై తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తనకున్న ప్రాణభయం దృష్ట్యా, తన పేరును బయటపెట్టలేనని చెప్పిన ఆమె, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ప్రారంభించిన పోరాటం తరువాత, 'మీటూ' ఉద్యమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.