KTR: ఇద్దరు మీడియా అధిపతులు శత్రువులయ్యారు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • నవంబర్ 20 తరువాత లగడపాటి సర్వే చేయలేదు
  • మీడియా అధిపతుల ప్రోద్బలంతోనే ఫలితాలు మారాయి
  • వారి బండారం 12న బయటపెడతానన్న కేటీఆర్
రెండు మీడియా సంస్థల అధిపతులు, చంద్రబాబు, లగడపాటి కలసి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న సర్వే ఫలితాలను మార్చివేశారని కేటీఆర్ ఆరోపించారు. కొన్ని దినపత్రికలు రంగును మార్చుకున్నాయని, తమకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలిసిపోయిందని అన్నారు. 11వ తేదీన ఫలితాలు వెల్లడైన తరువాత ఆ ఇద్దరు మీడియా అధిపతుల పేర్లనూ తాను వెల్లడిస్తానని అన్నారు.

నవంబర్ 20 తరువాత సర్వే చేయలేదని లగడపాటి రాజగోపాల్ స్వయంగా అంగీకరించారన్న విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్, మరి ఫలితాలు ఎలా మారాయని ప్రశ్నించారు. అకస్మాత్తుగా న్యూస్ పేపర్లు ప్రజా కూటమికి మద్దతు పలికాయని, గతంలోనూ చంద్రబాబు టీఆర్ఎస్ ను అస్థిర పరిచే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు సమయంలోనూ ఈ మీడియా సంస్థలు చంద్రబాబుకు అండగా ఉన్నాయని, 12న తాను మీట్ ది ప్రెస్ లో పాల్గొని వారి బండారాన్ని బయటపెడతానని తెలిపారు.
KTR
Lagadapati
Media
Telugu Papers

More Telugu News