Andhra Pradesh: జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీడీపీని మ‌ట్టిక‌రిపించిన చిట్టి నాయుడు ఎక్క‌డ‌?: లోకేశ్ పై విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

  • టీడీపీకి ఆయన డిపాజిట్లు ద‌క్క‌కుండా చేశారు
  • ఓటర్ల‌ను క‌న్ఫ్యూజ్ చేసేస్తాడ‌ని బాబు భ‌య‌ప‌డిపోయారు
  • ట్విట్ట‌ర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నేత‌
తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌, ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన‌క‌పోవ‌డంపై వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అన్నీ తానై టీడీపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కూడా రాకుండా మ‌ట్టిక‌రిపించిన చిట్టి నాయుడు ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.

అస‌లు చిట్టినాయుడు ఏమైపోయాడ‌ని ప్ర‌శ్నించారు. తన అనర్గళ స్పీచ్‌లతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి వ‌చ్చే ఓట్ల‌ను కూడా పోగొడ‌తాడ‌న్న భ‌యంతో చంద్రబాబు తన కొడుకును అమ‌రావ‌తి దాట‌కుండా ముగ్గేసి వ‌చ్చారని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో స్పందించారు.
Andhra Pradesh
Telangana
YSRCP
Vijay Sai Reddy
Nara Lokesh
Chandrababu
maravati
criticise

More Telugu News