Maharashtra: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు... ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు!

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • మరింత డబ్బు కోరుతోందని ఆరోపణ
  • మరొకరిని పెళ్లాడాలని భావిస్తోంది
  • పోస్టర్లు అంటించిన యువకుడి కోసం పోలీసుల గాలింపు
తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడం లేదన్న కారణంతో, ఆమె ఒప్పుకోవాలని కోరుతూ ఊరంతా పోస్టర్లు అంటించేశాడో యువకుడు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. ఈ పోస్టర్ లో ఉన్న వివరాల ప్రకారం, యువతి వివరాలు చెప్పిన అతను, తాము సహజీవనం చేస్తున్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా భావించామని, అయితే, మరింత డబ్బు కోరుకుంటున్న ఆమె, తనను వదిలి మరొకరిని వివాహం చేసుకోవాలని భావిస్తోందని రాసుకొచ్చాడు.

ఆమె తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాలని కోరాడు. నగర వ్యాప్తంగా ఈ పోస్టర్లు కనిపించడంతో, విషయం పోలీసులకు తెలిసింది. పోస్టర్ల తొలగింపు ప్రక్రియను చేపట్టిన పోలీసులు, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక తమ బిడ్డ వివరాలు వెల్లడించడంతో ఆమె కుటుంబీకులు పరువు పోయిందని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. 
Maharashtra
Pune
Posters
Marriage
Lover
Live in

More Telugu News