Liquor: రాజకీయ నాయకులా మజాకా.. మాదాపూర్‌లో పది రూపాయలకే ఫుల్ బాటిల్!

  • సిటీ వైన్స్‌లో రాజకీయ మందు దందా
  • రూ.10 కే ఖరీదైన మద్యం
  • పోలీసుల అదుపులో మద్యం షాపు యజమాని ప్రవీణ్ గౌడ్
మనసుంటే మార్గం ఉంటుందనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రకరకాల పద్ధతులు ఎంచుకుంటున్నారు. కొందరు డబ్బుల పంపిణీలో బిజీగా ఉండగా, మరికొందరు మద్యంతో ఓట్ల కొనుగోలుకు రెడీ అవుతున్నారు. అయితే, మద్యం పంపిణీ చేస్తూ దొరికిపోకుండా ఉండేందుకు నాయకులు కొత్త పద్ధతి కనుక్కున్నారు. అందులో భాగంగా మాదాపూర్‌లో కేవలం పది రూపాయలకే రూ.460 విలువైన ఫుల్ బాటిల్‌ను విక్రయిస్తున్నారు. రూ. 50 ఇస్తే రూ.600 విలువైన బాటిల్ లభిస్తుంది. వంద రూపాయలకు రూ.1000 విలువైన మద్యం బాటిల్‌ను అందిస్తున్నారు.

మద్యం పంపిణీ చేస్తున్నట్టు ఎవరికీ అనుమానం రాకుండా ఈ ఏర్పాట్లు చేశారన్నమాట. మాదాపూర్‌లోని సిటీ వైన్స్‌లో జరుగుతున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగుచూసి సంచలనమైంది. అయితే, ఇక్కడో మెలిక కూడా ఉంది. పది రూపాయలకే బాటిల్ లభిస్తోంది కదా.. అని ఎవరు పడితే వారు వెళ్తే ఇవ్వరు. మందుబాబులు ఇచ్చే నోటుకు ఉన్న సిరీస్ నంబరు సరిపోలాలి. అప్పుడే ఈడు మనోడని బాటిల్ ఇస్తారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో దాడిచేసిన పోలీసులు సిటీ వైన్స్ మేనేజర్ ప్రవీణ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Liquor
Hyderabad
Madhapur
city wines
politics
Elections

More Telugu News