kcr: కేసీఆరే మళ్లీ సీఎం కావాలంటూ నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు!

షార్ట్స్‌లో చూడండి
తన ప్రేమ ఫలించాలనో, దేవుడు ప్రత్యక్షం కావాలనో తమ నాలుకలు కోసుకుని మొక్కు తీర్చుకున్న సంఘటనలు గతంలో విన్నాం. తాజాగా, తెలంగాణకు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఓ ఆంధ్రా యువకుడు తన నాలుకను కోసుకున్నాడు.

హైదారాబాద్, బంజారాహిల్స్ లోని ఓ ఆలయంలో సదరు యువకుడు తన నాలుక కోసుకుని కానుకగా హుండీలో వేశాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడిని అక్కడి వారు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడిని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ గా గుర్తించారు. 
Go Back to Shorts
kcr
andhra
youth
tongue
Hyderabad

More Telugu News