Thalasani Srinivas Yadav: డబ్బు బలుపుతో ఇంట్లో కూర్చొని సర్వేలు చేస్తున్నారు: తలసాని
- అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు
- కోట్లాది ప్రజల జీవితాలను ఒక వ్యక్తి చెప్పేస్తారా?
- ఎన్నికలకు ముందే గెలుస్తారని చెప్పడమేంటి?
ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని.. సర్వేలు చేస్తున్నవారు తమ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందో చెప్పగలరా? అని టీఆర్ఎస్ నేత, సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు బలుపుతో ఇంట్లో కూర్చొని సర్వేలు చేస్తున్నారని.. తెలంగాణలోని కోట్లాది ప్రజల జీవితాలను ఒక వ్యక్తి చెప్పేస్తారా? అని మండిపడ్డారు.
సర్వేలు హాబీ అయితే కావొచ్చు కానీ వాటిని అందరి మీద రుద్దడం సరికాదన్నారు. ఎన్నికలు జరగక ముందే కొంతమంది గెలుస్తారని చెప్పడమేంటని తలసాని ప్రశ్నించారు. నాలుగేళ్లు ప్రధాని మోదీతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు చిన్నమోదీ అని.. ఆయన కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను.. ఒక ప్లాన్ ప్రకారం కొంతమంది కలిసి చేసిన కుట్ర అని తలసాని ఆరోపించారు.