Chandrababu: కేసీఆర్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: చంద్రబాబు

  • మోదీ మతాలను రెచ్చగొడుతున్నారు
  • కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ చేపట్టింది నేనే
  • తెలంగాణ అభివృద్ది కోసమే ప్రజాకూటమి
ప్రధాని మోదీ మతాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుంటే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ అభివృద్ది కోసమే ప్రజాకూటమి ఏర్పాటు చేసినట్టు ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా ప్రాజెక్టు విషయమై తనపై చేసిన విమర్శలపై చంద్రబాబు స్పందించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ చేపట్టింది తానేనని స్పష్టం చేశారు. అలాంటి తనపైనే కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu
KCR
Narendra Modi
Telangana
Krishna project

More Telugu News