viajy devarakonda: తొలిసారిగా .. ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ!

  • 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయం 
  • 'గీత గోవిందం' హిట్ తో స్టార్ హోదా 
  • 'టాక్సీవాలా'తో పెరిగిన మార్కెట్
విజయ్ దేవరకొండ ఈ ఏడాది స్టార్ స్టేటస్ ను అందుకోవడమే కాదు .. ఆదాయ పరంగా కూడా మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. ఈ కారణంగానే ఫోర్బ్స్ జాబితాలో ఆయనకి స్థానం లభించింది. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ చేరిపోయి రేర్ ఫీట్ ను సాధించాడు. కెరియర్లో తొలిసారిగా విజయ్ దేవరకొండ పేరు ఫోర్బ్స్ జాబితాలో ప్రత్యక్షమైంది.

ఈ ఏడాది 14 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్న వాడిగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ జాబితాలో 72వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్ దేవరకొండ, 'గీత గోవిందం'తో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. 'టాక్సీవాలా' సినిమా ఆయన మార్కెట్ ను మరింతగా పెంచేసింది. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ మరింత మెరుగైన స్థానంలో కనిపించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
viajy devarakonda

More Telugu News