jhanvi kapoor: వైమానిక యోధురాలి పాత్రలో జాన్వీ కపూర్

షార్ట్స్‌లో చూడండి
తొలి సినిమాతోనే గ్లామర్ పరంగాను .. నటన పరంగాను జాన్వీ కపూర్ మంచి పేరు తెచ్చుకుంది. దాంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె మాత్రం తనని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం కలిగిన కథలను మాత్రమే ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కరణ్ జోహర్ నిర్మించే మల్టీ స్టారర్ తో పాటు ఓ బయోపిక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితం కానుంది. కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా చేసిన వీరోచిత విన్యాసాలను గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆమె జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే గుంజన్ సక్సేనాను జాన్వీ కపూర్ కలుసుకుని ఆమె అనుభవాలను గురించి అడిగి తెలుసుకుని వచ్చిందట. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ పాత్రను చేయడానికి జాన్వీ కపూర్ అంగీకరించడం పట్ల అంతా ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
Go Back to Shorts
jhanvi kapoor

More Telugu News