Telugudesam: ప్రత్యేకహోదాకు అడ్డుపడ్డ కేసీఆర్ కు వైసీపీ మద్దతిస్తుందా!: పంచుమర్తి అనురాధ

  • వైసీపీ ఆత్మ కేసీఆర్, అంతరాత్మ కేటీఆర్
  • తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరలేదా?
  • టీఆర్ఎస్ కు వైసీపీ బహిరంగంగానే మద్దతిస్తోంది
ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడ్డ కేసీఆర్ కా వైసీపీ మద్దతిచ్చేదంటూ ఏపీ టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఆత్మ కేసీఆర్, అంతరాత్మ కేటీఆర్ అని విమర్శించారు. తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితే జగన్ కనీసం గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ కు వైసీపీ బహిరంగంగానే మద్దతిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనమేముందని అన్నారు. వైసీపీని ఏపీ ప్రజలు క్షమించరని ఆమె నిప్పులు చెరిగారు.


 
Telugudesam
panchumarthi anuradha
YSRCP

More Telugu News