indrakaran reddy: ఎన్ని కూటములు వచ్చినా.. టీఆర్ఎస్ దే అధికారం: ఇంద్రకరణ్ రెడ్డి

  • తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం
  • ప్రజాకూటమిని ప్రజలు నమ్మరాదు
  • బూటకపు సర్వేలతో లగడపాటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
నిర్మల్ పట్టణంలోని మోతీనగర్, పాన్ గల్లి, నగరేశ్వర్, కోలిబండ, బాగులవాడ, ఇంద్రనగర్ లలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఓట్లు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. ఎన్ని కూటములు వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ప్రజాకూటమి మాటలను ప్రజలు నమ్మరాదని, ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. బూటకపు సర్వేలతో లగడపాటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
indrakaran reddy
TRS
Chandrababu
Telugudesam
prajakutami
nirmal

More Telugu News