khairathabad: టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే ఇంటికి వెళ్లి ఓటేయాలని కోరిన ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌

  • ప్రచారంలో భాగంగా కేకే నివాసం ఉంటున్న ప్రాంతంలో పాదయాత్ర
  • కేకే కుటుంబానికి ఓట్లుండడంతో ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
  • ప్రచారం ఎలా సాగుతోందని అడిగి తెలుసుకున్న కేకే
ఎన్నికల ప్రచారం చివరి దశలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మహాకూటమి తరపున నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు.

నిన్న శ్రవణ్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా వెళుతూ అభ్యర్థులను ఓట్లు అడిగారు. అదే ప్రాంతంలో కేకే నివాసం కూడా ఉంది. దీంతో శ్రవణ్‌ కేకే ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిశారు. తనకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేకే స్పందిస్తూ ప్రచారం ఎలా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ పోటీ చేస్తున్నారు.
khairathabad
k.kesavarao
dasojsravan

More Telugu News