ipl: ఐపీఎల్ ఫ్రాంఛైజీ 'ఢిల్లీ డేర్ డెవిల్స్' పేరు మారింది!

  • ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్పు
  • ఢిల్లీ దేశ రాజధాని కావడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ గా నామకరణం
  • పార్లమెంటు భవనం స్ఫూర్తితో లోగో రూపకల్పన
ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ తన పేరును మార్చుకుంది. వచ్చే ఏడాది నుంచి 'ఢిల్లీ క్యాపిటల్స్' పేరుతో బరిలోకి దిగుతామని ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రకటించింది. ఢిల్లీ మన దేశానికి రాజధాని కావడంతో... ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చామని తెలిపారు. పార్లమెంటు భవనాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త లోగోను రూపొందించామని చెప్పారు. మరోవైపు, వరుస సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ చతికిలపడుతూ వస్తోంది. కొత్త పేరుతోనైనా వారి జాతకం మారుతుందేమో వేచి చూడాలి.
ipl
delhi dare devils
delhi capitals

More Telugu News