TRS: చంద్రబాబు తన పెంపుడు మీడియాతో వస్తున్నారు.. ప్రజలు ఆ మాయలో పడొద్దు!: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జర్మనీ నియంత హిట్లర్ అనుచరుడు గోబెల్స్ కు తమ్ముడని టీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ  చంద్రబాబు ఆదేశాలతో ఆయన అనుచరులు, మద్దతుదారులు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. తన పెంపుడు కుక్కలాంటి మీడియా సంస్థలు, సోషల్ మీడియా సాయంతో ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యల పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, ఆ మాయలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
TRS
Telangana
KTR
Chandrababu
Telugudesam
Telugudesam
gobels

More Telugu News