Jana Sena: జనసేనను, పవన్ ను అసలు పట్టించుకోబోము: వైసీపీ

  • జనసేన పెద్ద పార్టీయే కాదు
  • చంద్రబాబు నుంచి పవన్ కు డబ్బు మూటలు
  • ఆరోపించిన వైకాపా ఎంపీ విజయసాయి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీయే తమ ప్రత్యర్థని, జనసేనను తాము పెద్ద పార్టీగా గుర్తించడం లేదని, పవన్ కల్యాణ్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నుంచి పవన్ కు డబ్బు మూటలు వెళ్లాయని, ఇప్పుడు కూడా ఆయన డబ్బిలిస్తే, పవన్ తన కాల్ షీట్స్ ను చంద్రబాబుకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. జనసేన టీడీపీకి దగ్గరవుతోందని, ఈ రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు కోసం రూ. 5 వేల కోట్లను ఇస్తానని రాహుల్ గాంధీకి చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటికే, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల కోసం చంద్రబాబు రూ. 500 కోట్లు పంపారని అన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం ఆయన రూ. 1,200 కోట్లు పంపించారని ఆరోపించారు.

విజయవాడలో ఒక్క వంతనెను పూర్తి చేయలేకపోతున్న చంద్రబాబు, తాను హైదరాబాద్ లో సైబరాబాద్‌ ను, శంషాబాద్‌ విమానాశ్రయాన్ని నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే, 'కోడికత్తి' అంటున్నారని, అదే కత్తితో చంద్రబాబు తన మెడపై 3 అంగుళాలు గుచ్చుకోగలరా? అని ప్రశ్నించారు.
Jana Sena
Jagan
Vijayasai Reddy
Pawan Kalyan
Chandrababu

More Telugu News