Revanth Reddy: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావొచ్చు.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ షాకింగ్ కామెంట్లు!

షార్ట్స్‌లో చూడండి
అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ అజాద్ తెలిపారు. అధికారంలో ఉన్నామని కళ్లు నెత్తికి ఎక్కకూడదని, కాళ్లు నేలపైనే ఉండాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు కేసీఆర్ రేవంత్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ విడుదలైన అనంతరం ఆయనను కొడంగల్ లో పరామర్శించిన ఆజాద్ మీడియాతో మాట్లాడారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టి కొడంగల్ రావడం ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్ ను విడుదల చేసి కొడంగల్ కు రావాలని సవాల్ విసిరారు. అధికారం ఎన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

రేవంత్ సీఎం అవ్వొచ్చు అని ఆజాద్ చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కాగా, ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా పలువురు నేతలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana
KCR
arrest
Chief Minister

More Telugu News