Andhra Pradesh: కంటి చూపు, కాలి గోటితో కాదు.. సంభ్రమాశ్చర్యాలతోనే బాలయ్య ఎవరినైనా చిత్తు చేస్తాడు!: విజయసాయిరెడ్డి సెటైర్

  • బాలకృష్ణ హెచ్చరికలను లైట్ గా తీసుకోవద్దు
  • తడాఖా చూపిస్తా అంటూ తొడగొడుతున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ చేసే హెచ్చరికలను లైట్ గా తీసుకోవద్దని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఉభయ రాష్ట్రాల నేతలను హెచ్చరించారు. కంటి చూపు, కాలి గోటితో మాత్రమే కాదు.. సంభ్రమాశ్చర్యాలతో సైతం బాలయ్య ఎంతటి యోధుడినైనా చిత్తు చేయగలడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే బాలయ్య ప్రతీసారి ‘ఆంధ్రప్రదేశ్ కు రా.. చూసుకుంటా.. నా తడాఖా ఏంటో చూపిస్తా! అంటూ తొడగొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

అంతకుముందు స్పందిస్తూ.. ‘ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు హేళనగా మాట్లాడారని విజయసాయిరెడ్డి విమర్శించారు. దేశంలోని ప్రజలంతా ఒకే జాతి అనీ, సాంఘిక విభజన వల్లే కులాలు పుట్టాయన్నారు. ఈ విషయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. ఈ విభజనను రూపుమాపాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.
Andhra Pradesh
Balakrishna
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News