హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. సీబీఐ సమ్మతి ఉత్తర్వుల రద్దు సబబేనన్న ధర్మాసనం!
- నిబంధనల మేరకే ప్రభుత్వ ఉత్తర్వులు
- కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు
- పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం
సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చట్టసమ్మతంగానే ఉందని హైకోర్టు తెలిపింది. వేర్వేరు కేసుల్లో కోర్టులు ఎలాంటి అవరోధం లేకుండా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సదరు స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.