Police: ఇప్పటివరకూ రూ. 111 కోట్లు దొరికాయి: రజత్ కుమార్

  • రూ. 94.17 కోట్లు పట్టుకున్న పోలీసులు
  • గత ఎన్నికల్లో కన్నా ఇప్పటికే రూ. 28 కోట్లు అదనంగా డబ్బు సీజ్
  • ఈ రెండు రోజులూ తనిఖీలు చేస్తామన్న ఈసీ
తెలంగాణ ఎన్నికల్లో అక్రమ నగదుకు చెక్ చెప్పేందుకు జరుపుతున్న తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ రూ. 111 కోట్లను సీజ్ చేశామని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ వెల్లడించారు. ఈ డబ్బులో రూ. 94.17 కోట్లు పోలీసులకు పట్టుబడగా, మిగతా డబ్బును ఐటీ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారని చెప్పారు.

ఇదే సమయంలో రూ. 9.62 కోట్ల విలువైన మద్యం, రూ. 7.77 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశామని అన్నారు. గత ఎన్నికల కంటే అదనంగా రూ. 28 కోట్లు లభించాయని, ఈ రెండు రోజులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తామని అన్నారు. తాము స్వాధీనం చేసుకున్న డబ్బుకు సరైన పత్రాలను చూపిస్తే, దాన్ని వెనక్కు తిరిగి ఇస్తామని తెలిపారు.
Police
EC
Rajatkumar
Cash

More Telugu News