NTR: అక్క కోసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి రాలేకపోయిన కారణమిదే: టీడీపీ

  • కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థినిగా సుహాసిని
  • ఇద్దరు హీరోలూ షూటింగ్ లో బిజీ
  • ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
కూకట్ పల్లి నుంచి ప్రజా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని నిలబడగా, ఆమెకు ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ రాలేదన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, బాలకృష్ణ, తారకరత్న, పరిటాల సునీత తదితరులు సుహాసినిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఇక ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తీరిక లేనంత షూటింగుల్లో బిజీగా ఉండటంతోనే వారిద్దరూ ప్రచారానికి రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన 100 కిలోలకు పైగా బరువు పెరిగారని సమాచారం. తన లుక్ బయటకు వెళ్లకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదని సమాచారం.
NTR
Kalyanram
Suhasini
Kukatpalli

More Telugu News