TJS: టీజేఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ కారుపై రాళ్లదాడి.. గాయాలతో స్పృహ కోల్పోయిన నేత

  • మంగళవారం అర్ధ రాత్రి ఘటన
  • ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా దాడి
  • గాయాలతో ఆసుపత్రిలో చేరిక
దుబ్బాక టీజేఎస్ అభ్యర్థి  చిందం రాజ్‌కుమార్‌పై మంగళవారం అర్ధరాత్రి రాళ్ల దాడి జరిగింది. చేగుంట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వస్తుండగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం దీపాయంపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి దిగారు. ఆ సమయంలో కారులో రాజ్‌కుమార్ సహా నలుగురు ఉన్నారు. రాళ్ల దాడి మొదలు కాగానే వెనక సీట్లో ఉన్నవారు భయంతో కారు దిగి పరుగులు తీశారు. కారు అద్దాలు పగిలి రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TJS
Medak District
Doultabad
Chindam Rajkumar
Telangana

More Telugu News