Sarvey Sathyanarayana: ప్రజాకూటమి అధికారంలోకి వస్తే నేనే సీఎం: సర్వే సత్యనారాయణ

  • రోడ్‌ షోలో పాల్గొన్న సర్వే
  • దళితుడిని సీఎం చేస్తే నాకే అవకాశం
  • మంత్రినైనా అవుతానని ధీమా
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కనుక తాను ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ వుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ అన్నారు. కంటోన్మెంట్‌ పరిధిలోని కార్ఖానా, కాకగూడలో రోడ్డు షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం దళితుడిని సీఎం చేయాలని నిర్ణయిస్తే తనకే అవకాశం రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సీఎం కాకున్నా.. మంత్రినైనా అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.
Sarvey Sathyanarayana
Congress
CM

More Telugu News