Chandrababu: రేవంత్ అరెస్ట్‌పై మండిపడ్డ చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అరెస్టుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3గంటలకు తలుపులు పగులగొట్టి మరీ అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు.

కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి తప్ప విపక్షాలపై విద్వేషాన్ని వెళ్లగక్కడానికి కాదన్నారు. టీఆర్ఎస్ దగ్గర డబ్బు సంచులున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే రాహుల్‌తో కలిశానన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బోగస్‌ సర్వేలతో ప్రజల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు
Go Back to Shorts
Chandrababu
Revanth Reddy
KCR
TRS

More Telugu News