Kavitha: బాలకృష్ణ చిలక పలుకులను నమ్మే పరిస్థితి లేదు: ఎంపీ కవిత

  • బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన కవిత
  • కేసీఆర్ గట్టి నేత
  • మోదీ స్థాయిని తగ్గించుకున్నారు
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు.. ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేడు ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గట్టి నేత కాబట్టే దేశ ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి వెళుతున్నారని పేర్కొన్నారు.

కరెంట్ లేదని చెప్పి మోదీ తన స్థాయిని తగ్గించుకున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత... బాలకృష్ణ చిలక పలుకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
Kavitha
Balakrishna
Narendra Modi
KCR

More Telugu News