sundaram master: అలా నా భార్యను కోల్పోయాను .. కన్నీళ్లు పెట్టుకున్న సుందరం మాస్టర్

  • గుర్రప్పందాలు ఆడేవాడిని 
  • మా ఆవిడ వద్దన్నా వినేవాడిని కాదు 
  • ఆమె నిద్రమాత్రలు మింగేసింది   
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుందరం మాస్టర్ మాట్లాడుతూ, తన జీవితంలో చోటుచేసుకున్న ఒక విషాదమైన సంఘటన గురించి ప్రస్తావించారు. "నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ వుంది .. గుర్రప్పందాలు ఆడేవాడిని. అది మా ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఒకసారి నేను గుర్రప్పందాలు ఆడటానికి బెంగుళూర్ బయలుదేరాను. మా ఆవిడ వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు.

బెంగుళూర్ వెళ్లాను .. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాను. వచ్చేటప్పుడు తనతో గొడవపడి వచ్చాను కదా అనిపించి ఫోన్ చేశాను. ఆమె నిద్రమాత్రలు మింగిందనీ .. ఆసుపత్రిలో ఉందని చెప్పారు. ఎలాగైనా ఆమెను బతికించమని డాక్టర్ ను ప్రాధేయపడ్డాను. 50 నిద్రమాత్రలు మింగడం వలన ఆశలు పెట్టుకోవద్దని డాక్టర్ చెప్పారు. అలా నా జీవితంలో నాకున్న ఒక్క తోడు దూరమైంది" అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.   
sundaram master

More Telugu News