PJR: చంద్రబాబును అలా చూస్తానని అనుకోలేదు: పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి

  • రాహుల్, చంద్రబాబును ఒకే వేదికపై చూశాను
  • అదే వేదికపై నేను కూడా నిలబడే అవకాశం లభించింది
  • చంద్రబాబు ఎంతో అండగా నిలిచారన్న విష్ణు
తన జీవితంలో రాహుల్ గాంధీని, చంద్రబాబునూ ఒకే వేదికపై చూస్తానని అనుకోలేదని, వారితో పాటు తాను కూడా నిలబడే అవకాశం లభించిందని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీ విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు సీఎంగా ఉన్న సమయంలో తన తండ్రి పీజేఆర్ విపక్ష నేతగా ఉన్నారని గుర్తు చేసుకున్న ఆయన, తండ్రి చనిపోయిన తరువాత చంద్రబాబు తమ కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు.

చంద్రబాబుకు హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసే హక్కు ఉందని, అమరావతికి వెళ్లి కేసీఆర్ ఒక్క గల్లీలోకైనా వెళ్లగలడా? అని విష్ణు ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకటేనని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ కు వచ్చి తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ఆయన, రాహుల్, చంద్రబాబుల ప్రచారంతో తన విజయం ఖరారైందని చెప్పారు.
PJR
Jubleehills
Rahul Gandhi
Chandrababu
Vishnuvarthan Reddy

More Telugu News