Telangana: తెలంగాణలో మనమే గెలవబోతున్నాం: కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ

  • ఏఐసీసీ సర్వే జరిపించింది
  • మరో రెండు రోజులు ఉత్సాహంగా పని చేయండి
  • నేతలకు రాహుల్ గాంధీ సూచన
ఏఐసీసీ జరిపించిన సర్వేలో తెలంగాణలో ప్రజా కూటమి గెలుపుకు సిద్ధంగా ఉందని తేలిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు చంద్రబాబు పర్యటనలు విజయవంతం అయ్యాయని, ప్రజలు కూటమి పక్షానే ఉన్నారని ఆయన అన్నారు. ఈ రెండు రోజులూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని నేతలకు ఆయన సూచించారు. కాగా, ఎన్నికల ప్రచారం చివరి రోజైన బుధవారం కూడా రాహుల్ మరోసారి తెలంగాణకు వచ్చి ఓ సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ విషయంలో అధికారిక షెడ్యూల్ ఇంకా వెల్లడికాకపోయినా, రాహుల్ పర్యటన ఉంటుందని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రజా కూటమి కృషి చేస్తుండగా, ఏ ఒక్క అవకాశాన్నీ వదలరాదని రాహుల్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఇప్పటికే మూడు దఫాలుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. 
Telangana
Rahul Gandhi
Congress
Telugudesam

More Telugu News