Jagan: అవినీతికి కేరాఫ్ గా మారిన జగన్.. డైలాగులు పేల్చే పవన్ ను నమ్మొద్దు!: గోరంట్ల

  • ఏపీలో అవినీతిరహిత పాలన సాగుతోంది
  • తండ్రి అధికారంతో జగన్ అవినీతికి పాల్పడ్డారు
  • పవన్ కు రాజకీయాలపై అవగాహన లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శక, అవినీతిరహిత పాలన అందిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి కేరాఫ్ గా మారిన జగన్, సినిమా డైలాగులు చెప్పే పవన్ ల మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వీళ్లిద్దరి వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

కాకినాడలోని దేవీచౌక్ లో నిర్వహించిన ప్రజాదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కు ప్రజా సమస్యలపై అవగాహన లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్రమంతా పాదయాత్ర పేరుతో తిరుగుతున్నా జగన్ కు ప్రజాదరణ లభించడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి టీడీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని వ్యాఖ్యానించారు.
Jagan
Pawan Kalyan
Telugudesam
Gorantla Butchaiah Chowdary

More Telugu News