రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పని పోలీసులు
- ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు
- రేవంత్ అరెస్ట్‌తో ఉద్రిక్తంగా కొడంగల్
- నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్
రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి వచ్చారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. బొమ్రాస్‌పేటలో నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.