Narendra Modi: ఒక్కసారి బీజేపీపై భరోసా ఉంచండి.. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం: ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
ఒక్కసారి బీజేపీపై భరోసా ఉంచండి.. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను ప్రధాని మోదీ కోరారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల కలలను సాకారం చేసేందుకు తానెప్పుడూ ముందుంటానని, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

దేశం కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని, ఇప్పటికే చాలా మంది పేదలకు గృహాలు అందజేశామని, కొడుకు, కూతురు కోసం పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరగవని కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2022 వరకు ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.

నాడు సోనియా రిమోట్ కంట్రోల్ తో సాగిన పాలనలో సొంతింటి కల సాకారం కాలేదని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12,50,000 ఇళ్లు నిర్మించామని, కొత్త ఇళ్లలోనే ప్రజలు దీపావళి వేడుకలు చేసుకున్నారని అన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో కేవలం 80 వేల ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
Go Back to Shorts
Narendra Modi
bjp
Hyderabad
LB stadium
TRS

More Telugu News