Sujana Chowdary: ఈడీ ఎదుట హాజరైన సుజనా చౌదరి
- బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు
- నివాసం, కంపెనీల్లో ఈడీ సోదాలు
- 5 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆయన బ్యాంకులను రూ.5,700 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 24న ఆయన నివాసం, కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. విచారణకు హాజరు కావాలని 27న సమన్లు జారీ చేశారు.
ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు ఆయన్ను పలు అంశాలపై దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు.