Sonia Gandhi: ఆ రోజున బాబు దృష్టిలో సోనియా అవినీతి అనకొండ? మరి, నేడు అందాల కొండా!: వైఎస్ జగన్

  • రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీ నాడు ‘గాడ్సే’నా
  • నేడు.. ఆమె దేవత అయిందా?
  • రాహుల్ ని ‘మొద్దబ్బాయి’ అని చంద్రబాబు అనలేదా?
2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నాడు? రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ‘కాంగ్రెస్’ అని, సోనియా గాంధీ అవినీతి అనకొండ అని విమర్శించారని వైసీపీ అధినేత జగన్ ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరుగుతున్న బహిరంగం సభలో ఆయన మాట్లాడుతూ, ఆరోజున అవినీతి అనకొండ అయిన సోనియా గాంధీ, ఈరోజున అందాల కొండ, ఆనందాల కొండ అయిందా? అని ప్రశ్నించారు.

 ఆరోజున రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీని ‘గాడ్సే’ అన్నారని, ఈరోజున ఆమె ‘దేవత’ అని అంటున్నారని విమర్శించారు. ఆరోజున రాహుల్ గాంధీ లాంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని నాడు చంద్రబాబు ప్రశ్నించారని, మరి, ఈరోజున, రాహుల్ గాంధీ మేధావి అని ఆయన అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విలువలకు చంద్రబాబు పాతరేశారని చెప్పడానికి నిదర్శనం.. కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసిపోవడమేనని అన్నారు.
Sonia Gandhi
ys jagan
Chandrababu
Telugudesam
Congress

More Telugu News