Chandrababu: ఇంత కన్నా దిక్కుమాలిన సీఎం ఎక్కడైనా ఉంటారా?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • ఏపీలో 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
  • కేవలం, 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తారా?
  • బాబు హయాంలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?
ఏపీలో 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం ఏడు వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ తర్వాత సిలబస్, షెడ్యూల్ మారుస్తారని, ఇంతకన్నా దిక్కుమాలిన సీఎం ఎక్కడైనా ఉంటారా? అని చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నాడు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారని, ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించిన జగన్, జాబు రావాలంటే బాబు పోవాలని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో మంచి నీటి సౌకర్యం ఉందో లేదో కానీ, మందు షాపులైతే కనబడుతున్నాయని, ఇక, ఏదైనా పండగ వస్తే ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఇష్టానుసారం పెంచుతున్నారని అన్నారు. కరవుతో రాష్ట్రం అల్లాడిపోతుంటే చంద్రబాబు షో చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోమని ముఖ్యమంత్రిని చేస్తే, వాటిని పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారని విమర్శించారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Srikakulam District

More Telugu News