kcr: ‘బంగారు తెలంగాణ’ కాదు బంగారు కుటుంబాన్ని కేసీఆర్ తయారు చేసుకున్నారు: రాహుల్ విమర్శలు

  • బంగారు కుటుంబంలోని ధనవంతులకు కేసీఆర్ మేలు  
  • తెలంగాణకు ఆయన ఒరగబెట్టిందేమీ లేదు
  • ప్రజల ఆశలు, ఆకాంక్షలపై కేసీఆర్ నీళ్లు చల్లారు
‘బంగారు తెలంగాణ’కు బదులు బంగారు కుటుంబాన్ని కేసీఆర్ తయారు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తాండూరులో ప్రజాకూటమి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, బంగారు కుటుంబంలోని ధనవంతులకు కేసీఆర్ మేలు చేస్తున్నారు తప్ప, రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రానికి కేసీఆర్ న్యాయం చేస్తారని తాము ఆశించాం కానీ, అలా జరగలేదని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలపై కేసీఆర్ నీళ్లు చల్లారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, పంచాయతీ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
kcr
Rahul Gandhi
tandur
prajakutami

More Telugu News