యువకులను ప్రోత్సహించేందుకే ఇక్కడికి వచ్చా: సీఎం చంద్రబాబు
- తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మా ప్రయత్నం
- భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు
భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని, మాయమాటలు చెప్పి రెచ్చగొట్టాలని చూస్తే కుదరదని టీఆర్ఎస్ ను పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు.