janasena: జన సైనికుల మృతి ఘటనపై పవన్ తీవ్ర మనస్తాపం

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న అనంతపురంలో నిర్వహించిన కవాతు, బహిరంగ సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఓ ప్రకటనలో పార్టీ పేర్కొంది.

ఈ రోజు సాయంత్రం నిర్వహించే సంతాపసభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్టు పేర్కొంది. సంతాప సభ నేపథ్యంలో ముందుగా అనుకున్న ‘జనసేన తరంగం’ ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమం రేపటికి వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
janasena
Pawan Kalyan
anathapuram

More Telugu News