టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు: ఖుష్బూ
- కేసీఆర్ హయాంలో కవితకు మాత్రమే భరోసా ఉంది
- మహిళల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు
- కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది
తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని, మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఇదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే ఆయన ప్రభుత్వం పనిచేస్తోందన్న ఖుష్బూ, తమ పార్టీ అధికారంలోకొస్తే అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, ‘సీఎం’ అనే పదాన్ని ‘కమీషన్ మ్యాన్’గా మర్చారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.