surya: ఇంతవరకూ చేయని పాత్రలో సూర్య

  • చెన్నైలో చివరి షెడ్యూల్ 
  • 15 రోజుల్లో టాకీపార్ట్ పూర్తి 
  • వేసవి సెలవుల్లో విడుదల  
కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి పెద్దగా గ్యాప్ రానీయకుండా సూర్య చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపించడానికి ఆయన ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. అలా కొత్త కాన్సెప్ట్ తో ఆయన 'ఎన్జీకే' సినిమా చేస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ రోజున చెన్నైలో మొదలైంది.

15 రోజుల పాటు ప్లాన్ చేసిన షెడ్యూల్లో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా టాకీ పార్టు పూర్తవుతుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా కొనసాగే ఈ కథలో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ తరహా కథలో ఆయన చేయడం ఇదే మొదటిసారి కావడంతో, అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించే ఈ సినిమాను, వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.  
surya
rakul
saipallavi

More Telugu News